- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్దురాలి మెడలో గొలుసు చోరీ చేసిన ఆటో డ్రైవర్
శుభకార్యానికి వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటో ఎక్కిన 70 ఏళ్ల వృద్ధురాలిని ఆటో డ్రైవర్ దోచుకున్నాడు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శుభకార్యానికి వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటో ఎక్కిన 70 ఏళ్ల వృద్ధురాలిని ఆటో డ్రైవర్ దోచుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని కెనాల్ కట్ట ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. శుభకార్యానికి వెళ్లేందుకు ఓ వృద్ధురాలు నిజామాబాద్ కెనాల్ కట్ట వద్ద బుధవారం ఆటో ఎక్కింది. ఆటోలో వృద్ధురాలు ఒక్కతే ఉండటంతో వృద్ధురాలిని ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గుండ్ల గొలుసును లాక్కున్నాడు. ఆమె వద్ద ఉన్న రూ. 200 లను కూడా తీసుకుని వృద్ధురాలిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధురాలు ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన ఘటన గురించి తన చెల్లెలి కొడుకు కు వివరించడంతో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.






