- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరాలపై దాడులు.. 81 మందిపై కేసులు నమోదు
దిశ, కామారెడ్డి : పేకాట స్థావరాలపై దాడులు చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం

దిశ, కామారెడ్డి : పేకాట స్థావరాలపై దాడులు చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పేకాట ఆడే స్థావరాలపై పోలీసులు దాడులు కొనసాగించారు. ఈ దాడుల్లో పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని..పేకాట రాయుళ్ల వద్ద రూ.85,312 నగదు, 41 మొబైల్స్, 9 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి సమాచారం తెలిస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డైల్ లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సూచించారు.






