- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలు పై రోకలి బండతో దాడి.. 7 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
రోకలిబండతో తల పగులగొట్టి.. బండరాయితో మోది వృద్ధురాలి మెడలో నుంచి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.

దిశ, భిక్కనూరు : రోకలిబండతో తల పగులగొట్టి.. బండరాయితో మోది వృద్ధురాలి మెడలో నుంచి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ చౌక్ సమీపంలో ఉప్పరి లక్ష్మీ (70) అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పటివరకు ఇంటి ముందు ఉన్న అరుగుపై కూర్చున్న ఆమె వంట చేసుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది. వంట చేసుకునేందుకు అన్ని సిద్ధం చేసుకుంటూ, కల్లుతో సేద తీరుతోంది. వారాంతపు సంత ఇంటిముందే జరగడంతో ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ, గుర్తు తెలియని అగాంతకుడు ఇంట్లోకి ప్రవేశించి మెయిన్ డోర్ మూసివేసి లోపలికి గడియ పెట్టాడు. వంటగదిలో కూర్చున్న ఆమె వద్దకు వెళ్లి మెడలో ఉన్న సుమారు 7 తులాల విలువ చేసే బంగారు పుస్తెలతాడు, దానికి ఉన్న గుండ్లు, లాకెట్ ను లాక్కెళ్లే ప్రయత్నం చేయగా ఆమె తిరగబడింది. దీంతో ఇరువురు మధ్య చాలాసేపు పెనుగులాట జరగడం అంతలోనే అగాంతకుడు వంటింట్లో పక్కనే ఉన్న రోకలిబండతో తల పగులగొట్టాడు. అయినప్పటికీ కారుతున్న రక్తాన్ని సైతం లెక్కచేయకుండా అగాంతకున్ని గట్టిగా పట్టుకుంది.
ఇరువురి మధ్య జరిగిన పెనుగులాటలో అగంత కుని జేబులో నుంచి స్మార్ట్ ఫోన్ కింద పడిపోయింది. అది చూసుకోకుండా బండరాయితో గట్టిగా సదరు వృద్ధురాలిని మోదడంతో కింద పడిపోయింది. ఇదే అదనుగా మెడలో ఉన్న గొలుసు తెంపుకొని డోర్ తీసుకొని పరార్ అయ్యాడు. తల పగులగొట్టి గొలుసు ఎత్తుకెళ్లాడని, కారుతున్న రక్తాన్ని సైతం లెక్కచేయకుండా.. బయటకు వచ్చి చెప్పడంతో వారాంతపు సంతకు వచ్చి వెళ్లే వారితో పాటు, చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అపహరించుకుపోయిన పుస్తెలతాడు విలువ సుమారు10.5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతోపాటు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అగంతకుడిని సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు లక్ష్మి కి తీవ్ర రక్తస్రావం కావడంతో, స్థానికంగా ప్రాథమిక వైద్య చికిత్సలు చేయించి, కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వృద్ధురాలి కుమారుడు ఉప్పరి రాములు రాత్రి ఫోన్ లో దిశతో మాట్లాడుతూ వివరించారు.






