అత్యాచార ఘటనలో నిందితుని అరెస్ట్

by Ratna Kumari |

దిశ‌, కామారెడ్డి : అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా పాల్వంచ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్పీ రాజేష్ చంద్ర శుక్ర‌వారం మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

అత్యాచార ఘటనలో నిందితుని అరెస్ట్
X

దిశ‌, కామారెడ్డి : అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా పాల్వంచ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్పీ రాజేష్ చంద్ర శుక్ర‌వారం మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. పాల్వంచ మండలం ఫరీద్​పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న అత్యాచారానికి గురైన విషయం విధితమే. అయితే అదే గ్రామ శివారులో ఉన్న రైస్ ​మిల్లులో పని చేసే బీహార్ కార్మికుడు సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన మహిళను స్థానికులు గుర్తించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని గురువారం మహారాష్ట్రలోని గొండ్యా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

Next Story