- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మూర్ లో ఉద్రిక్తత.. అనుమానాస్పదంగా ఆర్మూర్ లో బాలింత మహిళ మృతి..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల మున్సిపల్ 2 వ వార్డు పరిధిలోని వడ్డెర కాలనీలోని ఆ సంఘం సమీపంలో రెండు నెలల బాలింత అయిన మక్కల పూజ (27) అనుమానాస్పద స్థితిలో బుధవారం ఉదయం మృతి చెందింది.

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల మున్సిపల్ 2 వ వార్డు పరిధిలోని వడ్డెర కాలనీలోని ఆ సంఘం సమీపంలో రెండు నెలల బాలింత అయిన మక్కల పూజ (27) అనుమానాస్పద స్థితిలో బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ రెండవ వార్డ్ పరిధిలోగల వడ్డెర కాలనీలో నిజాంసాగర్ కెనాల్ ప్రక్కన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ రెండవ వార్డులో గల వడ్డెర కాలానికి చెందిన మక్కల పూజ (27) రెండు నెలల బాలింత అయిన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి భర్త మక్కల సాయిలు సుమారు మూడు నెలల క్రితం, మరిది ఇద్దరు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వలస వెళ్లారు. దీంతో వడ్డెర కాలనీలో అత్తమ్మ మక్కల నర్సు తో కలిసి రెండు నెలల బాలింత అయిన మక్కల పూజ నివాసముండేది. మంగళవారం రాత్రి అత్త నర్సుతో మృతి చెందిన బాలింత పూజ కు గొడవ జరిగినట్లు సమాచారం. మృతి చెందిన బాలింత మహిళ అయిన పూజ ఆడబిడ్డకు గతంలోని వివాహమై విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. ఆమె ఆడబిడ్డ వారి కాలనీలోనే అద్దెకు ఇల్లు తీసుకొని కిరాయికి ఉన్నట్లు సమాచారం. కానీ బుధవారం ఉదయం ఆడబిడ్డ ఇంటికి వచ్చి ఉన్నట్లు కనపడిందని కాలనీవాసులు పలువురు చెబుతున్నారు.
బాలింత అయిన పూజను అత్త నర్సు, ఆడబిడ్డ ఇద్దరు కలిసి చంపివేసి ఉంటారని వడ్డెర కాలనీలో బుధవారం ఉదయం వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై ఆర్మూర్ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే నిజానిజాలు బయట పడతాయని అని వడ్డెర కాలనీలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మా అమ్మాయి పూజను అనవసరంగా చంపివేశారని తొర్లికొండ కు చెందిన మృతురాలి బంధువులు ఆరోపణలు చేస్తూ ఆ అత్త మక్కల నర్సు ఇంటిపై దాడికి యత్నించారు. అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సమాచారాన్ని అందుకున్న ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి, ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఆ సంఘటన స్థలం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆర్మూర్ ఏసిపి, ఎస్హెచ్ఓలు పోలీస్ సిబ్బందితో కలిసి ఆ సంఘటనా స్థలం వద్ద ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.






