- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనారోగ్యం బారిన ఆర్మూర్ మున్సిపల్ ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా, గతంలో మామిడిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసిన కొండ్రపేట నరేశ్ అనారోగ్యం బారిన పడ్డారు.

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా, గతంలో మామిడిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసిన కొండ్రపేట నరేశ్ అనారోగ్య బారిన పడ్డారు. ప్రస్తుతం ఈ మున్సిపల్ ఉద్యోగి నరేష్ హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ నందు వెంటిలేటర్ మీద వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయం అతని నిరుపేద కుటుంబం తట్టుకోలేక పోతుంది. వీళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి సైతం అంతగా ఆర్థికంగా ఏం బాగాలేదు. మున్సిపల్ ఉద్యోగి అయిన నరేష్ చిన్నతనంలోనే ఆయన నాన్న ను కోల్పోయాడు. చిన్నప్పటి నుండే ఇంటికి పెద్ద దిక్కుగా అమ్మకు, తమ్ముళ్లకు అండగా నరేష్ నిలబడ్డాడు. కానీ ప్రస్తుతం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు.
ఆ నిరుపేద కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న నరేష్ ఆరోగ్య పరిస్థితి ఇలా కావడంతో ఆర్మూర్ ప్రాంతంలోని పలువురు వారి కుటుంబానికి తెలిసిన సన్నిహితులు, కుటుంబ బంధువులు చూసి తట్టుకోలేక పోతున్నారు. వారి కుటుంబ పెద్దగా ఉన్న నరేష్ ఆరోగ్యం కుదుటపడేందుకు అందరూ ఆదుకోవాలని ఆ నిరుపేద కుటుంబం ప్రతి ఒక్కరిని వేడుకుంటుంది. హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో ఒక్క రోజుకు సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దయచేసి మానవత దృక్పథంతో ఆలోచించి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నరేష్ ఆరోగ్యం కుదుటపడేందుకు సహాయం అందించి మా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా మీకు తోచిన అమౌంట్ ను కొండ్రపేట నరేశ్ నంబర్ కు *86883 65656*ఫోన్ పే చేసి మా కుటుంబాన్ని ఆదుకోండి అని ఆ కుటుంబం వినమ్రంగా వేడుకుంటుంది.






