- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మూర్లో అప్పుల బాధతో యువకుని ఆత్మహత్య
by Bhanu |
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రాజారాం నగర్ కాలనీలో అప్పుల బాధతో గుడ్ల ప్రవీణ్ (35) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ ఆదివారం తెలిపారు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రాజారాం నగర్ కాలనీలో అప్పుల బాధతో గుడ్ల ప్రవీణ్ (35) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ ఆదివారం తెలిపారు. పూసవర్ల వ్యాపారం చేసే ప్రవీణ్ కు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులయ్యాయి. నష్టం రావడంతో చనిపోతానని భార్యకు చెప్పి శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు గాలించగా ఉదయం రాజారాం నగర్ కాలనీలోని స్మశాన వాటికలో వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Next Story






