- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో హోల్ సేల్ గా బంగారాన్ని విక్రయించే హోల్ సేల్ వ్యాపారస్తులైన తండ్రి, కొడుకులు 15 రోజులుగా ఆర్మూర్ ప్రాంతంలో కనబడక పరారవడంతో ఆర్మూర్ లోని చిరు బంగారం బాధిత వ్యాపారులు అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో హోల్సేల్ బంగారం వ్యాపారస్తులుగా ఏళ్లుగా చలామణి అవుతున్న ఇద్దరు తండ్రి కొడుకులు పరారైనట్లు ఆర్మూర్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో స్థిరపడ్డ ఈ హోల్సేల్ బంగారు వ్యాపారస్తులు ఆర్మూర్ ప్రాంతంలోని బంగారు దుకాణాలకు బంగారు బిల్లులను అమ్మకాలు చేసేవారు. బంగారం దుకాణ దారులకు మార్కెట్ కంటే హోల్సేల్ గా 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు తులం బంగారాన్ని హోల్సేల్ గా ఆ వ్యాపారస్తులు అమ్మేవారు. ఈ ఇద్దరు తండ్రి కొడుకులైన బంగారం హోల్సేల్ వ్యాపారస్తులు 15 రోజులుగా ఆర్మూర్లో కనబడకుండా పోవడంతో బాధిత బంగారం దుకాణదారుల్లో అలజడితో ఆర్మూర్ ప్రాంతంలో ఈ బంగారం వ్యాపారస్తుల పరార్ అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు తండ్రి కొడుకులైనా హోల్సేల్ బంగారం వ్యాపారస్తులు ఆర్మూర్ ప్రాంతంలోని పలు బంగారం దుకాణదారులు కోట్ల రూపాయల నగదును బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వారికి అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆర్మూర్ పట్టణ కేంద్రానికి చెందిన బంగారం వ్యాపారస్తుల్లో ఒకరు వంద తులాల కోసం, మరొకరు 60 తులాల కోసం, ఇంకొకరు 40 తులాల కోసం, అదేవిధంగా చాలామంది వ్యాపారస్తులు 25 తులాల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆ ఇద్దరు హోల్సేల్ వ్యాపారస్తులకు నగదును అప్పచెప్పినట్టు సమాచారం. ఇలా మొత్తం ఆర్మూర్ ప్రాంతానికి చెందిన బంగారు వ్యాపారస్తుల నుంచి ఈ హోల్సేల్ బంగారం వ్యాపారస్తులైన ఇద్దరు తండ్రి కొడుకులు సుమారు ఐదు కోట్ల రూపాయలతో పరారైనట్లు చర్చ ఆర్మూర్ ప్రాంతంలో తీవ్రంగా జరగడంతో ,ఆ హోల్ సేల్ బంగారు వ్యాపారస్తులకు నగదు ముట్టజెప్పిన బాధిత ఆర్మూర్ బంగారు దుకాణదారుల్లో తీవ్ర ఆందోళన పడుతున్నారు. కాగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రధాన బంగారం దుకాణదారులు ఆ హోల్సేల్ బంగారు వ్యాపారస్తులైన తండ్రి కొడుకులు ఏమీ పరారు కాలేదని, వారి నగదు మహారాష్ట్రలోని ముంబైలో స్ట్రక్ కావడం వల్ల 15, 20 రోజులుగా ఆర్మూర్ ప్రాంతంలో లేరని చెబుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు బంగారు దుకాణదారుల నుంచి 5 కోట్ల రూపాయలను తీసుకెళ్లిన హోల్సేల్ బంగారు వ్యాపారస్తులు కొందరు చెబుతున్నట్టుగా ముంబాయి నుంచి తిరిగి వచ్చి బంగారు పసిడి బిల్లలు కానీ, లేదా వారి నగదు వారికి ఇస్తేనే గాని నమ్మశక్యం కాని పరిస్థితి తయారయింది. ఏది ఏమవుతుందో కొద్ది రోజుల్లోనే తేట తెల్లం కానుంది. ఆర్మూర్ ప్రాంత వ్యాపారస్తులు ఇద్దరు తండ్రి కొడుకులైన హోల్సేల్ బంగారం వ్యాపారుల చేతుల్లో బురిడీ కొట్టించుకోనున్నారా..! లేక వారు నగదు చెల్లించిన ప్రకారం బంగారం అందుకోనున్నారా అనే విషయంపై .. ఈ హోల్సేల్ బంగారు వ్యాపారుల పరార్ పై ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.






