ఆర్మూర్ మున్సిప‌ల్ ఓట‌ర్ లిస్ట్ ను స‌వ‌రించాలి : బీఆర్ఎస్ అధ్య‌క్షుడు న‌రేంద‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిప‌ల్ ఓట‌ర్ లిస్ట్ ను స‌వ‌రించాలని బీఆర్ఎస్ అధ్య‌క్షుడు పూజ‌ న‌రేంద‌ర్ పేర్కొన్నారు.

ఆర్మూర్ మున్సిప‌ల్ ఓట‌ర్ లిస్ట్ ను స‌వ‌రించాలి : బీఆర్ఎస్ అధ్య‌క్షుడు న‌రేంద‌ర్
X

దిశ‌, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిప‌ల్ ఓట‌ర్ లిస్ట్ ను స‌వ‌రించాలని బీఆర్ఎస్ అధ్య‌క్షుడు పూజ‌ న‌రేంద‌ర్ పేర్కొన్నారు. గురువారం ఆర్మూర్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రావ‌ణికి బీఆర్ఎస్ అధ్య‌క్షుడు న‌రేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ సందర్భంగా పూజ నరేందర్ మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్లలో వార్డుల వారీగా అనేక అవకతవకలు ఉన్నాయని వాటిని పునః పరిశీలన చేసి ఓటర్ లిస్టులో గల తప్పులను సవరించాలని మున్సిపల్ కమిషనర్ ని కోరారు. ఒక ఇంటికి సంబంధించిన భార్య భర్తల ఓట్లు వేర్వేరు వార్డులో వచ్చాయని పూజ నరేందర్ అన్నారు. ఇలాంటి తప్పులు మున్సిపల్ లో చాలా ఉన్నాయని వాటిని బీఎల్ఓల చేత పున పరిశీలన చేయించి తప్పులను సవరించాలన్నారు. ఏ వార్డుల్లో నివాసం ఉండే ప్రజల ఓట్లను అదే వార్డుల్లో వచ్చేలా సర్వే చేయించాలని కోరారు. ఒక వార్డులో నివాసముండే వ్యక్తుల ఓట్లు ఇంకో వార్డులో ఉన్నాయని అలాంటి పొరపాట్లను సరి చేయాలన్నారు. ఓటర్ జాబితా సవరణ చేయడంతో పాటు వార్డుల సంఖ్యను పెంచాలని, ప్రతి వార్డులో ఓట్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఓటర్ లిస్ట్ ను ఆదరాబాదరుగా తయారు చేయకుండా క్రమ పద్ధతిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తీరిగ్గా తయారుచేసి ప్రచురించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు పోలా సుధాకర్, సుంకరి రవి, దొండి శ్యామ్, మీరా శ్రావణ్, సాంబాడి ఆనంద్, అజీమ్, లతీఫ్, మాలిక్ బాబా, జాయద్వి హైమద్ భాయ్, జావీద్, ఖలీం ఉన్నారు.

Next Story