ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ లిఫ్ట్ లో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులు

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన గల జీవన్ రెడ్డి మాల్ లిఫ్టు లో ఇద్దరు చిన్నారులు ఇరుక్కున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్  లిఫ్ట్ లో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన గల జీవన్ రెడ్డి మాల్ లిఫ్టు లో ఇద్దరు చిన్నారులు ఇరుక్కున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జీవన్ రెడ్డి మాల్ లో షాపింగ్ చేసేందుకు వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన ఆ చిన్నారులు సరదాగా లిప్టులో ఎక్కిన పిల్లలకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్న‌ట్టుండి అక‌స్మాత్తుగా క‌రెంట్ పోవ‌డంతో స‌ర‌దాగా గ‌డిపేందుకు లిప్ట్ ఎక్కిన చిన్నారులు మ‌ధ్య‌లో ఉండిపోయారు. దాదాపు గంటసేపు లిప్ట్ లో ఇరుక్కోవ‌డంతో ఆ చిన్నారుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

షాపింగ్ చేసేందుకు వారి తల్లిదండ్రులతో జీవన్ రెడ్డి మాల్ కి వచ్చిన ఆ చిన్నారులు సరదాగా లిఫ్టులో ఎక్కిన కొద్దిసేపటికే లిఫ్టులో అంతరాయం ఏర్పడి లిఫ్టు ఆగిపోయింది. దీంతో లిప్టులోనే ఆ ఇద్దరు చిన్నారులు చిక్కుకున్నారు. షాపింగ్ యాజ‌మాన్యం జీవన్ రెడ్డి మాల్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఓపెన్ చేశారు. దీంతో ఆ ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు అమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. లిఫ్టులో చిన్నారులు ఇరుక్కున్న సమయంలో జీవన్ రెడ్డి మాల్ యాజమాన్యంపై చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

Next Story