- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాడ్జీల్లో ఇష్టారాజ్యం.. డబ్బు ఆశ జూపి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి
నిజామాబాద్ జిల్లాలో వ్యభిచారం వేళ్లూనుకు పోతోంది. లాడ్జీల్లో, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో వ్యభిచార వృత్తిని కొందరూ ప్రొఫెషన్ గా కొనసాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో వ్యభిచారం వేళ్లూనుకు పోతోంది. లాడ్జీల్లో, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో వ్యభిచార వృత్తిని కొందరూ ప్రొఫెషన్ గా కొనసాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు. గతంలో వినాయక్ నగర్ లోని ఓ హోటల్ తో పాటు తాజాగా రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీలో కూడా పోలీసులు దాడులు నిర్వహించి విటులను, మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆర్మూర్ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో కూడా పోలీసులు రైడ్ నిర్వహించి కొంతమంది విటులు, మహిళలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిన లాడ్జీల నిర్వాహకులు అడ్డగోలు సంపాదన కోసం ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా, లాడ్జీకి పురుషులు, మహిళల మధ్య ఎలాంటి చట్టపరమైన బంధుత్వమున్నట్లు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, అన్నీ తెలిసి కూడా అధిక మొత్తంలో అద్దె వసూలు చేసి వారికి లాడ్జీల్లో గదులు కేటాయిస్తున్నారు. ఆ గదుల్లో వీరుఅసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ, శారీరక సుఖాలను అనుభవిస్తున్నారు. ఇదంతా లాడ్జిల నిర్వాహకులకు తెలిసే జరుగుతున్నప్పటికీ నిబంధనల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ విటులకు, మహిళలకు లాడ్జీల్లో నిర్వాహకులు గదులు అద్దెకు ఇస్తూ వ్యభిచారాన్ని, అక్రమ సంబంధాలను పెంచి పోషిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలోనే సెక్స్ రాకెట్ ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గతంలో కూడా పలుమార్లు రుజువైంది. పలు చోట్ల పోలీసులు పక్కా సమాచారంతో ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేసిన సందర్భాలున్నాయి. నగరంలోని కంఠేశ్వర్, హౌజింగ్ బోర్డు, విద్యుత్ నగర్, గంగాస్థాన్ వంటి ఫాష్ ఏరియాలోని కొన్ని ఇళ్లలో హైటెక్ వ్యభిచారం దందా కొనసాగుతోందని, పోలీసులకు ఈ విషయాలు తెలిసే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఎక్కడెక్కడ వ్యభిచార రాకెట్ నడుస్తోంది. ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోందనే విషయాలన్నీ పోలీసుల్లో కొందరు పూర్తి సమాచారం ఉందని, కొన్ని చోట్లయితే పోలీసుల పరోక్ష సహకారంతోనే ఈ సెక్స్ రాకెట్ జోరుగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రొంపిలోకి కాలేజీ అమ్మాయిలు..
కాలేజీ అమ్మాయిల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని వారిని ప్రలోభపెట్టి నిజామాబాద్ నగరంలో కొందరు వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కాలేజీ అమ్మాయిలకు వివిధ రకాల డబ్బులు ఆశ జూపి, ఈజీగా ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశాలున్న మార్గంగా వారికి లేని భ్రమలు కల్పిస్తూ ఈ రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న ట్రెండుకు తగ్గట్లుగా హైఫైగా బతికేందుకు సరిపడా డబ్బులు తమ పేరెంట్స్ ఇంటి నుండి పంపించే అవకాశం లేకపోవడం, అవసరాలకు తమ దగ్గరున్న డబ్బు సరిపోక పోవడంతో కొందరు డబ్బు కోసమే, జల్సాల కోసమే ఈ వృత్తిపట్ల ఆకర్షితులవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ నగరంతో పాటు, ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోని లాడ్జీలు వ్యభిచారానికి అడ్డాలుగా మారడంతో కాలేజీ అమ్మాయిలతో పాటు, ఒంటరి మహిళలు, ఆంటీలను కూడా విటులకు సప్లయ్ చేసేందుకు నిజామాబాద్ నగరంలో కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయని తెలుస్తోంది. వీరిలో కొందరు మహిళలే కాలేజీ అమ్మాయిలను ట్రాఫ్ చేసి ఈ వృత్తిలోకి దింపి వారి జీవితాలను నాశనం చేసేందుకు కారణమవుతున్నట్లు సమాచారం.
అమ్మాయిలను ట్రాఫ్ చేసేవారిపై ఫోకస్..
లాడ్జీల పైన రైడ్ పాచేయడంతో పాటు అమ్మాయిలను ట్రాఫ్ చేసే వారిపై పోలీసులు ఫోకస్ చేయాల్సిన అవసరముంది. కాలేజీ అమ్మాయిలు, ఒంటరి మహిళల ఆర్థికావసరాలను వారి బలహీనతలుగా చేసుకుని వారిని ట్రాఫ్ చేసి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న వారిని పోలీసులు గుర్తించి పట్టుకోవాలని, సమాజంలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా సహకరించాలని కోరుతున్నారు.






