- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > ప్రపంచ అందాల పోటీల మెనూలో అంకాపూర్ చికెన్‌ను చేర్చాలి : గంట సదానందం
ప్రపంచ అందాల పోటీల మెనూలో అంకాపూర్ చికెన్‌ను చేర్చాలి : గంట సదానందం
by Bhanu |
హైదరాబాదులో నిర్వహించనున్న ప్రపంచ సుందరీమణుల పోటీలు తెలంగాణ ప్రజల గర్వానికి నిదర్శనమని ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గంట సదానందం పేర్కొన్నారు.

X
ఆర్మూర్, దిశ: హైదరాబాదులో నిర్వహించనున్న ప్రపంచ సుందరీమణుల పోటీలు తెలంగాణ ప్రజల గర్వానికి నిదర్శనమని ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గంట సదానందం పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంప్రదాయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం అనందకరమని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొననున్న దేశ విదేశాల అందాల భామలకు విందుగా ఏర్పాటు చేసే భోజనాలలో అంకాపూర్ చికెన్‌ను ప్రత్యేకంగా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది అంతర్జాతీయంగా పేరుపొందిన వంటకం అని, దీని ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన అవకాశమిది అని అన్నారు. హైదరాబాద్‌ను ఈ పోటీలకు వేదికగా ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణకు ప్రత్యేకతను చాటే అంకాపూర్ చికెన్‌ను మెనూలో చేర్చేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.
Next Story






