- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మకానికి పెట్టిన అంగన్ వాడి గుడ్లు..!
దిశ, కమ్మర్ పల్లి : ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల్లో గర్బిణీలు, బాలింతలు, చిన్న పిల్లల కోసం పౌష్టికాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పాలు, గుడ్లు అందిస్తుంటుంది.

దిశ, కమ్మర్ పల్లి : ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల్లో గర్బిణీలు, బాలింతలు, చిన్న పిల్లల కోసం పౌష్టికాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పాలు, గుడ్లు అందిస్తుంటుంది. చిన్నపిల్లలకు కొంత మంది అంగన్ వాడి కేంద్రానికి వెళ్లిన వారికి అక్కడ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఇవన్ని బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ కుళ్లిన గుడ్లు, చెడిపోయిన పాలు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ తాజాగా మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కమ్మర్ పల్లిలోని ఓ కిరాణ షాపులో 10 కోడిగుడ్లను విక్రయించగా.. ఆ గుడ్లు అన్ని కూడా కుళ్లిపోవడం గమనార్హం. అయితే ఇవేంటని కిరాణ యజమానిని ప్రశ్నించగా.. అంగన్ వాడి గుడ్లు అని.. కొందరూ గుడ్లను అమ్మారని సమాధానం చెప్పవడం విశేషం.
పక్కదారి పడుతున్న అంగన్ వాడి గుడ్లు
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన అంగన్ వాడికి సంబంధించిన కోడి గుడ్లు మండల కేంద్రంలోని ఓ కిరణా షాపుల్లో అమ్మకానికి పెట్టారు. అంగన్ వాడీ సెంటర్లలో ఉండాల్సిన కోడి గుడ్లు కిరాణా షాపుల్లోకి ఎలా వస్తున్నాయని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంగన్ వాడీ గుడ్లను గుర్తు పట్టే విధంగా ప్రభుత్వం వాటిపై రంగులు వేసి సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. వాటిని గుర్తు పట్టుకుండా షాపుల యజమానులు రంగులను సబ్బు నీటితో శుభ్రం చేసి బహిరంగంగా విక్రయాలు చేస్తున్నారు. పిల్లలు, గర్భిణులకు అందాల్సిన గుడ్లు, పౌష్టిక ఆహారం పక్కదారి పట్టి కిరాణ షాపుల్లోకి చేరుతున్నాయి. అంగన్ వాడి గుడ్లు చిన్నగా ఉండి, కొన్నింటిపై ఆ రంగులు పోకపోవటంతో గుడ్లను అమ్ముతున్నారు.
ఎప్పుడూ అవే గుడ్లు ఇచ్చేవారు : వెంకటేష్
గత కొద్ది రోజులుగా కమ్మర్ పల్లిలోని కిరాణ షాపుల్లో కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్నాను. ఎప్పుడు గుడ్లను తీసుకున్నా అంగన్ వాడీ కోడిగుడ్లు ఇచ్చేవారు. కానీ ఈసారి ఇచ్చిన కోడి గుడ్లు ఇంటికి వెళ్లి వంట చేసుకునే సమయానికి కుళ్లి పోయాయి. ఇదేంటని కిరాణ షాప్ యజమాని ని అడగ్గా ఆ గుడ్లకు బదులు వేరే గుడ్లు ఇస్తానని సమాధానం చెప్పాడు. అంగన్ వాడి గుడ్లు మీకు ఎలా వస్తున్నాయంటే కొంత మంది తమకు అమ్ముతున్నారు.






