- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని వాహనం ఢీ.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన శనివారం మండలంలోని బంజారా తాండ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, నాగిరెడ్డిపేట్ : గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన శనివారం మండలంలోని బంజారా తాండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా తాండా గ్రామానికి చెందిన సాతెల్లి బాల్ రాజు (45) అనే వ్యక్తి ఈనెల 26న రాత్రి 8 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఎక్కల దేవి అరవింద్ కుమార్ అనే వ్యక్తితో కలిసి పోచారం ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారిని దాటుతుండగా రోడ్డుపై ఎల్లారెడ్డి వైపు నుండి మెదక్ వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని కారు వీరిద్దరిని బలంగా ఢీ కొట్టీ కారును ఆపకుండా కారుతో సహా వ్యక్తి పారిపోయాడు. ఈ ప్రమాదంలో సాతెల్లి బాల్ రాజ్ తలకు తీవ్రగాయలు కాగా, ఎక్కల దేవి అరవింద్ కుమార్ కు కాలు విరిగింది. తీవ్ర గాయాలపాలైన సాతెల్లి బాల్ రాజ్ ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు జరిపించారు. కాగా బాల్ రాజ్ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య అరుణ, ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నట్లు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.






