- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మా కంపెనీలో విచారణ
అసైన్డ్ భూములు కబ్జా కు గురయ్యాయన్న ఆరోపణలపై, రెవెన్యూ యంత్రాంగం వారం రోజులుగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు పట్టణం సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీలో గుట్టుగా ఎంక్వయిరీ మొదలుపెట్టారు.

దిశ, భిక్కనూరు : అసైన్డ్ భూములు కబ్జా కు గురయ్యాయన్న ఆరోపణలపై, రెవెన్యూ యంత్రాంగం వారం రోజులుగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు పట్టణం సమీపంలో ఉన్న ఫార్మా కంపెనీలో గుట్టుగా ఎంక్వయిరీ మొదలుపెట్టారు. పక్షం రోజుల క్రితం గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా చర్చ జరిగిన సందర్భంగా, అసైన్డ్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున కంపెనీ యాజమాన్యం కబ్జాలు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కంపెనీకి వెళ్లి ఎంక్వయిరీ చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ అధికార యంత్రాంగం వారం రోజులుగా కంపెనీలో అసైన్డ్ భూములకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భూములకు సంబంధించి విచారణ కొలిక్కి వచ్చినప్పటికి, అసైన్డ్ భూమి ఎన్ని ఎకరాలు ఉందన్న విషయాన్ని మాత్రం బయటకు లీక్ కావడం లేదు. సుమారు 50 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఎంక్వయిరీ కి సంబంధించి రెండు మూడు రోజులలో పూర్తి వివరాలతో కూడిన నివేదిక ను అధికార యంత్రాంగం ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంక్వయిరీ వాస్తవమే
ఫార్మా కంపెనీ పై అసైన్డ్ భూములకు సంబంధించి ఎంక్వయిరీ చేస్తున్నది వాస్తవమేనని తహశీల్దార్ సునీత శుక్రవారం సాయంత్రం "దిశ" తో వెల్లడించారు.






