- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ కరెన్సీ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
దిశ, కామారెడ్డి : ఫేక్ కరెన్సీ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన

దిశ, కామారెడ్డి : ఫేక్ కరెన్సీ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 23న వైన్స్ లో పని చేసే అఖిల్ అనే వ్యక్తి వైన్స్ లో ఉండగా ఓ వ్యక్తి వచ్చి రెండు నకిలీ రూ.500 నోట్లను ఇచ్చి మద్యం తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన సిద్దాగౌడ్ అనే వ్యక్తి దొంగనోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లినట్టు గుర్తించి విచారించారు. అయితే ఫేస్ బుక్ యాడ్ ద్వారా అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసినట్టు తెలిపాడు.
పశ్చిమ బెంగాల్ కి చెందిన సౌరవ్ డే అనే వ్యక్తి సిద్ధాగౌడ్ కి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతనికి కాంటాక్ట్ అయ్యాడని.. ఫేక్ కరెన్సీ కావాలని అడిగితే రూ.5వేలకు రూ.10వేలు నకిలీ నోట్లు పంపిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. సెప్టెంబర్ 18న కొరియర్ ద్వారా 18 నకిలీ నోట్లు పంపించాడు. అందులో నుంచి రెండు నోట్లు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేసినట్టు తెలిపాడు. సీసీఎస్ బృందం వెస్ట్ బెంగాళ్ కి వెళ్లి సెప్టెంబర్ 27న సౌరవ్ డే ను అరెస్ట్ చేసి విచారించగా.. హరి నారాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి నకిలీ నోట్లను బీహార్ కి చెందిన రషీద్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకొని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. సౌరవ్ డే, హరినారాయణ భగత్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు తెలిపారు.
అనంతరం బీహార్ వెళ్లిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రషీద్ ను పట్టుకున్నట్టు చెప్పారు. రషీద్ ఎంఎస్సీ చదువుకున్నాడని.. అతనికీ కలర్, కెమికల్ మిక్సింగ్ పై అవగాహన ఉండటంతో నకిలీ నోట్ల తయారీతో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన నందులాల్ జంగ్ డే, చట్టరామ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన సౌరవ్ డే, హరి నారాయణ భగత్, పండిత్@శారతక్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన కరెన్సీ కాట్ని @ లఖన్ కుమార్ దుటే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, మహారాష్ట్రకు చెందిన శివశర్మ@ప్రమోద్ కాట్రేలు ఒక గ్రూపుగా ఏర్పడి కరెన్సీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్టుగానే నందులాల్ జంగ్ డే, చట్టరామ్, రషీద్ కలిసి బిక్రమ్ గంజిలో వివిధ షాపులలో కరెన్సీ తయారీకి కావాల్సిన కంప్యూటర్, కలర్స్, ఇంక్ ప్రింటర్స్, కట్టర్స్, ల్యామినేటర్స్, టోనర్స్, కలర్ ప్రింటర్ ఇతర సామగ్రిని కొనుగోలు చేశారన్నారు. అనంతరం 500, 200, 100, 50, 20 రూపాయల నకిలీ నోట్లను 1:2 రేషియో ద్వారా ఆర్డర్ తీసుకుని ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన కస్టమర్ల నుంచి వివిధ నెంబర్ల స్కానర్లకు డబ్బులు పంపించుకుని కొరియర్ ద్వారా ఫేక్ కరెన్సీని పంపిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇందులో రషీద్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాద్యాయునిగా పని చేస్తున్నాడని, సోషల్ మీడియా ద్వారా ఏర్పాటు చేసుకున్న ఏజంట్లకు 1: 0.5 రేషియో ప్రకారం డబ్బులు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా 2024 లో 2,17,000 నోట్లను సరఫరా చేసిందని ఎస్పీ వెల్లడించారు. ఆర్డర్ తీసుకున్న హైదరాబాద్ వ్యక్తి వద్ద 63000 లభించాయని, ఇంకా 37 వేలు ఇతర వాటికి ఖర్చయినట్టు తెలిపాడని వివరించారు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి 3 కోట్లకు ఆర్డర్ పెట్టారన్నారు. అతడిని అరెస్ట్ చేశామని, అతని తండ్రి పరారీలో ఉన్నట్టు తెలిపారు. తాము చేపట్టిన ఆపరేషన్ కు ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా తమకు సహకరించారని తెలిపారు. 15 రోజులు 8 బృందాలు 900 కిలోమీటర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసిందని ఆయన పేర్కొన్నారు. బీహార్ లో జరిగిన ఆపరేషన్ డేంజర్ గా సాగిందని, కోల్ కత్తాలో జనావాసాల మధ్య నిందితులను పట్టుకోవడం కష్టతరంగా మారిందని, యూపీ, మహారాష్ట్రలో డెకాయ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు. సెంట్రల్ రైల్వే తమకు పూర్తిగా సహకరించిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసారని, వాళ్ళను తాము కస్టడీకి కోరి విచారణ చేపడతామన్నారు. నకిలీ నోట్ల సరఫరా రాష్ట్రాల మధ్యనే సాగిందా, ఇతర దేశాలకు సరఫరా చేసారా అనే ప్రశ్నకు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. ఆ విషయం తదుపరి విచారణలో తేలుతుందన్నారు. ముఠాలో 12 మంది ఉన్నారని, అందులో రషీద్, కరెన్సీ కాట్నే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, సౌరవ్ డే, హరి నారాయణ భగత్, సిద్దాగౌడ్, కృతిక రాజ్ లను అరెస్ట్ చేసి రిమాండు కు తరలించడం జరుగుతుందని, మరొక నలుగురు నందులాల్ జంగ్ డే, చట్టరామ్, పండిత్, శివ శర్మలు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన అఖిల్ ను ఎస్పీ శాలువాతో సత్కరించి నగదు బహుమతి అందజేశారు. ఆపరేషన్ ఫేక్ కరెన్సీ ముఠా లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు. కలకత్తా ఆపరేషన్ లో స్వయంగా పాల్గొన్న ఎఎస్పీ చైతన్య రెడ్డిని ఎస్పీ అభినందించారు.
స్వాధీనం చేసుకున్నది ఇవే
రూ.3,08,300 ఫేక్ కరెన్సీ, రూ.15300 ఒరిజినల్ నగదు, రూ.8830 సగం ప్రింట్ అయిన కరెన్సీ, బ్రీజా కారు, 9 మొబైల్స్, వైట్ కలర్ పేపర్ బండిల్స్, వైట్ బాండ్ పేపర్, గ్రీన్ కలర్ ఫాయిల్, బ్లూ కలర్ ఫాయిల్, సిల్వర్ కలర్ ఫాయిల్, ట్రాకింగ్ పేపర్, 4 ప్రింటర్స్, స్కానర్స్, సెక్యూరిటీ థ్రెడ్ వైట్ పేపర్, మల్టీ కలర్ రబ్బర్స్, అల్టిమేట్ 12 కంపెనీ లామినేటర్ మిషన్, ఒక కంప్యూటర్, మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్, కలర్స్ అండ్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్, పెన్ డ్రైవ్, కటింగ్ పేపర్స్, కట్టర్స్ స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.
నకిలీ కరెన్సీ తీసుకున్నది వీరే...
సచ్ ఢిల్లీ హర్యానా(పాణిపట్), అరవింద్ కుమార్ అమరోహ బెంగాల్ ఉత్తర ప్రదేశ్, చంద్ర ప్రకాష్ స్వామి, జైపూర్ రాజస్థాన్, దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్, విక్కీ కలకత్తా, సర్కస్ కలకత్తా, ఆకాష్ టాటా జంషెడ్‌పూర్, జార్ఖండ్, కిదిర్‌పూర్ కలకత్తా పశ్చిమ బెంగాల్, టిను ఫ్యూషన్ బారటబజార్, కలకత్తా, రాజేంద్ర చౌరసియా @ పప్పుపాల్, ఉత్తర ప్రదేశ్, ముఖేష్, మేదినీపూర్, పశ్చిమ బెంగాల్, రాంగోపాల్ వర్మ, అసన్సోల్, పశ్చిమ బెంగాల్, కలకత్తా నవదీప్, సూరత్, గుజరాత్, పాట్నా, బీహార్, హజారీ బాగ్, జార్ఖండ్, దిల్షెడ్, మహారాష్ట్ర, ప్రదీప్, పశ్చిమ బెంగాల్, సోను కుమార్, బొకారో, జార్ఖండ్, అమిత్ గొడ్డ, ప్రీతమ్ మోండల్, గోరియా, కలకత్తా, దీపక్, కలకత్తా, అయ్యన్ చక్రవర్తి, రాహుల్ లేక్ మోర్, కలకత్తా పార్టీ నకిలీ కరెన్సీ తీసుకున్న వారిలో ఉన్నారని ఎస్పీ వెల్లడించారు.






