- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
దిశ, ఆర్మూర్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చెందిన ఉపాధికి హామీ పనికి వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ

దిశ, ఆర్మూర్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చెందిన ఉపాధికి హామీ పనికి వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ నియంత చర్యలను ఆందోళన పోరాటాలతో తిప్పి కొట్టాలని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ కోరారు. సీపీఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి, కుతడి ఎల్లయ్య లు మాట్లాడుతూ.. పార్లమెంట్ లో విపక్షాల నిరసనల మధ్యలో వీబీ జీ రామ్ జీ బిల్లు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించడం పని పొందే రాజ్యాంగ హక్కును హరించడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. తన మంద బలాన్ని ఉపయోగించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత పెత్తందారులు కాంట్రాక్టర్లకు మేలు జరిగే విధంగా బిల్లును తీసుకు రావడం ఆందోళనకరం. కోట్లాది మంది రోజు వారీ వ్యవసాయ పనులు చేసే కూలీలు పని కోసం మళ్లీ వలస బాట పట్టే పరిస్థితి నెలకొన్న పోతున్నది. కేంద్ర ప్రభుత్వం యంత్రాలతో పని చేసే పద్ధతిని అవసరాల ప్రతిపాదక మీద పనులు ఇచ్చే పద్ధతిని దీనిలో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే నిధులు ఇస్తాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ లో 60 రోజులు పనిని పెట్టకుండా బంద్ చేయాలని పేర్కొనడం, కూలీలు పని చేసే హక్కును హరించడమే తక్షణ ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు కొండగంగాధర్, విడగొట్టి సాయిలు, టీ భూమన్న, బి రవి,కుమార్ కుల్దీ, సాయిలు, ఓంకార్, ఫిరోజ్ గణేష్ పాల్గొన్నారు.






