రాజంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అమ్మ ఒడి

by Ratna Kumari |

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని వైద్యురాలు డాక్టర్ విజయ మహాలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.

రాజంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో అమ్మ ఒడి
X

దిశ, రాజంపేట్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 'అమ్మ ఒడి' కార్యక్రమాన్ని వైద్యురాలు డాక్టర్ విజయ మహాలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి గర్భిణి స్త్రీలను ఆశా కార్యకర్తలు ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గర్భిణీలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, రక్త పోటు వంటి పరీక్షలు చేసి వారి ఆరోగ్య స్థితి గతులను పరిశీలించారు. అనంతరం డాక్టర్ విజయ మహాలక్ష్మి గర్భిణీలతో మాట్లాడుతూ..గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహార విలువల గురించి వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్త పరీక్షలు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకోవాలని, తద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగీత, ఆరోగ్య విస్తరణ అధికారి ఎండి. మంజూర్, సూపర్ వైజ‌ర్ గంగామణి, సంతోష్ ల్యాబ్ టెక్నిక్షన్, ఎ ఎన్ ఎం స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story