- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాక్‌లో అలూరు వాసి దుర్మరణం
దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కుర్మే చిన్న రాజేష్ (45) గురువారం ఇరాక్‌లో దురదృష్టవశాత్తు మరణించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కష్టంగా

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కుర్మే చిన్న రాజేష్ (45) గురువారం ఇరాక్‌లో దురదృష్టవశాత్తు మరణించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉండటంతో జీవనోపాధి కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఇరాక్‌కు వెళ్లిన రాజేష్ అక్కడ కూలీగా పనిచేస్తున్నారు. అయితే అక్కడ అనుకోకుండా మృతి చెందారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన తెలిసిన వెంటనే గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని ఆలూర్ కళ్లెం భోజరెడ్డి, స్థానిక నాయకులు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కోరగా.. వెంటనే స్పందించిన వినయ్ రెడ్డి, భూపతి రెడ్డి సంయుక్తంగా ఇరాక్ ప్రభుత్వానికి వినతిపత్రం పంపించారు. రాజేష్ కుటుంబానికి తక్షణ సాయం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆలూర్ ప్రజలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






