- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనిపించిన వారినల్లా పీకేశాయి
by Sridhar Babu |
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి.

X
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. చేపూర్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి పది మందిపై దాడి చేయగా ఆ దాడిలో 7 గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో పిచ్చికుక్కల దాడిలో గాయాలు అయిన జైపూర్ కు చెందిన పదిమందికి వైద్యం చేయించేందుకు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా ప్రథమ చికిత్స చేశారు. తీవ్ర గాయాల పాలైన నలుగురిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు.
- Tags
- dogs
Next Story






