Alert: మందుబాబులకు అలర్ట్.. తాగి వాహనం నడిపితే అంతే! మారిన రూల్స్ ఇవే

by Ramesh Naini |

రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర అమల్లోకి తెచ్చిన మోటార్ వాహన చట్టం 2019ని జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని సీపీ హెచ్చరించారు.

Alert: మందుబాబులకు అలర్ట్.. తాగి వాహనం నడిపితే అంతే! మారిన రూల్స్ ఇవే
X

రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర అమల్లోకి తెచ్చిన మోటార్ వాహన చట్టం 2019ని జిల్లాలో కఠినంగా అమలు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ కొత్త చట్టం ప్రకారం, మద్యం తాగి వాహనం నడుపుతూ తొలిసారి పట్టుబడితే ₹10 వేలు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడితే జరిమానా రూ.15వేలకు పెరుగుతుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు లేదా సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. మద్యం తాగి ప్రమాదానికి కారణమై ఎదుటివారు మరణిస్తే ఐపీసీ సెక్షన్ 105 బీఎన్ఎస్ (304 II) కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని సీపీ హెచ్చరించారు. ఎదుటివారికి గాయాలైతే సెక్షన్ 110 బీఎన్ఎస్ (308 ఐపీసీ) కింద 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. పోలీసులు నిర్వహించే బ్రీత్ అనలైజర్ పరీక్షను నిరాకరించినా అదే సెక్షన్ కింద శిక్షించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సీపీ వాహనదారులకు పిలుపునిచ్చారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మద్యం తాగి మత్తులో వాహనం నడిపితే ఇప్పటి దాకా చెల్లిందేమో కానీ ఇక నుంచి ఆ ఆటలు సాగవని పోలీసులు తెలుపుత్తున్నారు. మద్యం తాగి వాహనంతో రోడ్డెక్కి పోలీసులకు పట్టుబడితే రూ.10వేల ఫైన్ చెల్లించాల్సిందే అని అంటున్నారు. ఇంకా ఏమన్నా మాట్లాడితే జైలు శిక్ష కూడా అనుభవించాల్సిందే అంటున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టం 2019ని కొత్తగా అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం మద్యం తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై పోలీసులకు పట్టుబడితే రూ.10 వేల జరిమానా చెల్లించాల్సిందేనని లేదంటే జైలుకు వెళ్లాల్సిందేనని పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య అన్నారు. గతంలో ఈ జరిమానాలు చాలా తక్కువగా ఉండేవని, కొత్త చట్టం ప్రకారం విధించే జరిమానాలు ఇకపై మందుబాబులకు భారంగా మారనున్నట్లు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త చట్టం..

ఇదివరకు అమల్లో ఉన్న మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే రూ.2వేల జరిమానా, లేదా 6 నెలల పాటు జైలు శిక్ష విధించేవారు. జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశాలుండేవి. మొదటిసారి పట్టు బడిన తరువాత మూడు సంవత్సరాల కాల వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.3 వేలు జరిమానా, లేదా ఆరు నెలల జరిమానా విధించేవారు. అవసరమైతే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడేది. ఈ శిక్షలతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో మార్పు రాకపోవడంతో దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణం మద్యం తాగి వాహనాలు నడపడమేనన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మద్యం తాగి వాహనాలు నడపడమేనని ప్రభుత్వం గుర్తించింది. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఉపక్రమించింది.

పక్కాగా మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు..

జిల్లాలో ఇకపై మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కోర్టు రూ. 10వేలు జరిమానా విధిస్తుంది. లేదా, ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా జరిమానాతో పాటు జైలు శిక్షలు రెండు విధించే అవకాశాలు ఉన్నాయి. డ్రంకెన్ డ్రైవ్ లో రెండో సారి పట్టు బడితే రూ. 15 వేల జరిమానా లేదా 6 నెలల జైలు, లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జరిమానా, జైలు శిక్షలే కాదు..

మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే జరిమానా, జైలు శిక్షలు విధించడమే కాదని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని, సస్పెండ్ చేయవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఘటనలో ఎదుటి వారు మరణిస్తే ఐపీసీ సెక్షన్ 105 బీఎన్ఎస్ ( 304 II) కింద కేసు నమోదు చేయబడుతుందని సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ సెక్షన్ ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు లేదా జరిమానా లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని ఆయన తెలిపారు. తాగి నడిపి ప్రమాదం చేసి ఎదుటివారు గాయలకు గురైతే సెకండ్ 110 బీఎన్ఎస్ (308 ఐపీసీ) కింద కేసు నమోదు చేయబడుతుందన్నారు. ఈ సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు. పోలీస్ బ్రీత్ అనలైజర్ పరీక్ష నిరాకరిస్తే అదే సెక్షన్ కింద శిక్షించే అవకాశాలున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని సీపీ సాయి చైతన్య వాహనదారులకు పిలుపునిచ్చారు.

Next Story