- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి యావజ్జీవ శిక్ష
దిశ, కామారెడ్డి : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు చెప్పినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు చెప్పినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక మాచారెడ్డిలో వరుసకు నానమ్మ అయిన వాళ్లింటికి సెలవుల సమయంలో వచ్చేది. అప్పుడప్పుడు కేజీబీవీ నుంచి వచ్చి రాత్రి సమయంలో అక్కడే నిద్రించేది. దసరా సెలవుల సమయంలో వచ్చిన బాలిక ఎప్పటిలాగే రాత్రి నిద్రిస్తుండగా పక్కింట్లో ఉండే భూక్యా గణేష్ వచ్చి బాలికను అరిస్తే చంపేస్తా అని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టాడు. దాంతో విషయం దాచిపెట్టిన బాలిక పాఠశాలకు వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురైంది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా 2018 జనవరి 13న మాచారెడ్డి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. కేసులో శిక్ష పడుతుందని భావించిన నిందితుడు గణేష్ విదేశాలకు పారిపోగా ఇక్కడకు రప్పించి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కోర్టులో పోలీసులు సరైన సాక్షాధారాలు సమర్పించగా నిందితుడికి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారన్నారు. నిందితుడికి శిక్ష పడేలా సాక్షాలు కోర్టులో సమర్పించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.






