- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోలీ వేడుకల్లో అపశృతి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం జరుపుకున్న హోలీ పర్వదిన వేడుకల్లో అపశృతి నెలకొంది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం జరుపుకున్న హోలీ పర్వదిన వేడుకల్లో అపశృతి నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చెందిన బొగడ మీది హర్షిత్ (15) స్నేహితులతో కలిసి హోలీ వేడుకలను జరుపుకొని చెరువులో స్నానం చేసేందుకు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని గుండ్ల చెరువు వెళ్లాడు. కాలు జారి చెరువులో పడి మృతి చెందాడు. ఆర్మూర్ పట్టణ కేంద్రం గోల్ బంగ్లా ప్రాంతంలో మున్నూరు కాపు కులానికి చెందిన నరేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ లెక్చరర్ గా విధులు నిర్వహించే నరేష్ కు ఇద్దరు కొడుకుల సంతానం కలదు. నరేష్ పెద్ద కుమారుడు బోగడ మీది హర్షిత్ తన మిత్రులతో కలిసి హోలీ ఆడుకోవడానికి బయటకి వెళ్లాడు. తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు మృతుని బాబాయ్ బొగడ మీది సుమన్ కి అతని స్నేహితుడు నరేష్ ఫోన్ చేసి, ఆర్మూర్ లోని గుండ్ల చెరువులో ప్రమాదశాత్తు కాలుజారి నీటిలో పడ్డాడని తెలిపాడు. ఈ విషయాన్ని సుమన్ మృతుడి తండ్రి నరేష్ తెలుపగా.. హర్షిత్ కుటుంబ సభ్యులందరూ గుండ్ల చెరువు వద్దకు వెళ్లి చూడగా మృతుడి ఆచూకీ కనబడలేదు. చెరువులో పడ్డ హర్షిత్ ఆచూకీ కోసం రిస్క్ టీం వెతికి చెరువులోంచి బయటకు తీయగా.. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు పరీక్షించి హర్షిత్ మృతి చెందాడని తెలిపారు. హర్షిత్ మృతిపై ఎవరిపై ఎటువంటి అనుమానం లేదని మృతుడి తండ్రి నరేష్ పేర్కొన్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.






