- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది.

దిశ, బాన్సువాడ : ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 1లో నివాసం ఉండే భథాక్ సందీప్(24) మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంట్లో అనవసరంగా గొడవ పడుతుండేవాడని.. శుక్రవారం రోజు రాత్రి ప్రతి రోజు మాదిరిగానే ఇంట్లో గొడవపడి చనిపోతానని బెదిరించాడు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు సముదాయించగా.. ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అమ్మమ్మ కాలకృత్యాలకు నిద్ర లేచి ఇంటి బయటికి వచ్చి చూడగా.. మృతుడు రేకుల షెడ్డులో చున్నీతో ఉరేసుకొని మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు SHO తుల శ్రీధర్ తెలిపారు.






