పంచాయితీల పాలన గడువు ముగిసి ఏడాది.. తీవ్ర నిధుల కొరత

by Ramesh Goud |

గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగిసిన, ప్రత్యేక అధికారుల పాలన మొదలై నేటితో ఏడాది పూర్తయ్యింది.

పంచాయితీల పాలన గడువు ముగిసి ఏడాది.. తీవ్ర నిధుల కొరత
X

దిశ, ఆలూర్ : గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగిసిన, ప్రత్యేక అధికారుల పాలన మొదలై నేటితో ఏడాది పూర్తయ్యింది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో జీపీలకు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఏడాది కాలంగా పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి పనులు స్తంభించిపోయింది. గ్రామపంచాయతీ నిర్వహణ కార్యదర్శుల భారంతో నీటికొస్తున్నారు, కొన్ని సందర్భాలలో చిన్న గ్రామపంచాయతీల కార్యదర్శులు చేతి నుంచి డబ్బులు పెట్టాల్సిన పని, మల్టీపర్పస్‌ కార్మికులకు మాత్రం వేతనాలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ బీసీ గణన, ఇతరాత్రా కారణాలతో పల్లె పోరు మరింత ఆలస్యం అయ్యే, అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాల ద్వారా తెలుస్తోంది.

జిల్లాలో 545 (కొత్త వాటితో కలుపుకొని) జీపీ, 5,022 వార్డు స్థానాలున్నాయి. గతేడాది ఫిబ్రవరి 1తో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. 2వ తేదీన ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. మండలానికో జిల్లా స్థాయి అధికారిని, గ్రామాలకు సీనియర్‌ అసిస్టెంట్‌ పైస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి గ్రామాలు ప్రత్యేక పాలనలో కొనసాగుతున్నాయి. గ్రామపంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడం తో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇంటి పన్ను వసూళ్లతో కార్మికుల వేతనాలు చెల్లించగా,జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే వారి ఖాతాల్లో వేతనాలను జమ చేస్తోంది. మిగతా పంచాయతీల నిర్వహణను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గాలి కొదిలేశాయి. వీధిలైట్లు, తాగునీటి క్లోరినేషన్‌, ఇతరాత్ర నిర్వహణ అంతా పన్నుల రూపేణా వచ్చిన నిధులతో చేపడుతుండగా, మరికొన్ని చోట్ల కార్యదర్శులు తమ సొంత డబ్బుతో చేపడుతున్నారు. ఇక అభివృద్ధి పనుల ఊసేలేదు.

జీపీలకు నిధుల కొరత..

ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామపంచాయతీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. 2024-25 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.56.80 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.11.80 కోట్లు పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ నుంచి రూ.66.82 కోట్లకుగాను 10 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామపంచాయతీలకు రూ.110 కోట్లకుపైనే నిధులు రావాల్సిఉంది. నిధుల జాడ లేకపోవడంతో పంచాయతీల నిర్వహణ (ప్రత్యేకాధికారులకు తలకు మించిన భారంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story