ప్రారంభానికి నోచుకోని ప‌ల్లె ద‌వ‌ఖాన

by Ratna Kumari |

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానా కేంద్రాలను నిర్మించింది.

ప్రారంభానికి నోచుకోని ప‌ల్లె ద‌వ‌ఖాన
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానా కేంద్రాలను నిర్మించింది. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని సబ్ సెంటర్ 2023లో రూ. 20 లక్షలతో శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను 80 శాతం పనులు పూర్తి చేయించారు. సరిపడ నిధులు రాలేద‌ని సబ్ సెంటర్ కు తాళం వేశారు. సబ్ సెంటర్ చిన్న చిన్న సమస్యలు మినహా దాదాపు పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయి నెలలు గడిచినప్పటికీ దవాఖాన ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. మండల కేంద్రంలో ఉప కేంద్రం భవనం లేక గ్రామ పంచాయతీ భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో వైద్య సేవలు అందించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story