- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్ నిర్లక్ష్యంతో మూడేళ్ల బాలుడు మృతి
by Ratna Kumari |
దిశ, భీమ్ గల్ : స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్ గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. భీమ్ గల్ మండల

X
దిశ, భీమ్ గల్ : స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్ గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. భీమ్ గల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి చెందిన బస్సు నెంబర్ TS03UB4394 డ్రైవర్ జి.మధు స్కూల్ పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. తల్లి శిరీష తన కుమారుడినీ స్కూల్ బస్సులో ఎక్కిస్తుండగా.. తన వెంట వచ్చిన చిన్న కుమారుడు శ్రీకాంత్ ను డ్రైవర్ మధు బస్సును నిర్లక్ష్యంగా ముందుగా నడిపడంతో ఢీ కొట్టింది. దీంతో లకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించే సమయంలో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన పై భీమ్ గల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సందీప్ తెలిపారు.
Next Story






