చ‌నిపోయిన లేగ దూడ‌కు గోవుల క‌న్నీటి వీడ్కోలు..!

by Ratna Kumari |

దిశ‌, న‌వీపేట : లేగ దూడ మ‌ర‌ణించ‌డంతో త‌ల్లి ఆవు త‌ల్ల‌డిల్లిపోయింది. దూడ కు మూగ రోదనలతో కన్నీటి వీడ్కోలు పలికాయి. మిగతా గోవుల కంటే కన్న ప్రేమను, కట్టుకున్న వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న

చ‌నిపోయిన లేగ దూడ‌కు గోవుల క‌న్నీటి వీడ్కోలు..!
X

దిశ‌, న‌వీపేట : లేగ దూడ మ‌ర‌ణించ‌డంతో త‌ల్లి ఆవు త‌ల్ల‌డిల్లిపోయింది. దూడ కు మూగ రోదనలతో కన్నీటి వీడ్కోలు పలికాయి. మిగతా గోవుల కంటే కన్న ప్రేమను, కట్టుకున్న వారితో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న మానవులకు గోవులు చూపిన బాట అందరిని కదిలిస్తుంది. వివరాల్లోకి వెళ్లితే.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శనివారం రామాలయం కు చెందిన లేగ దూడ రేబిస్ వ్యాధితో మరణించింది. ఆలయ కమిటీ వారు లేగ దూడ అంత్యక్రియల ను నిర్వహించడానికి శ్మశాన వాటిక కు ఎడ్ల బండి పై తరలిస్తుండగా తల్లి ఆవుతో పాటు ఇతర ఆవులు సైతం బండిని అనుసరిస్తూ శ్మశాన వాటిక వరకు వెళ్లి తిరిగి వ‌చ్చాయి. స్మ‌శాన వాటిక వైపు వెళ్తున్న‌ గోవులనుచూసిన‌ అందరినీ కదిలిస్తుంది. లేగదూడ మరణం పై గోపులు చూపిన సానుభూతి, అనురాగం, ప్రేమను చూసి ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ ప్రేమను చూపిన గోవులు తమల్ని చూసి నేర్చుకోవాలని సందేశం ఇస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం విశేషం.

Next Story