నిజాంసాగ‌ర్ ప్రాజెక్ట్, ప్ర‌ధాన కాలువ‌ను సంద‌ర్శించిన ఇథియో ఫియో సిన‌ర్గోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎన్జీవో బృందం

by Nallavelli.Anjaneyulu |

ఇథియోఫియో నీటి పారుదల మంత్రిత్వశాఖ, సినర్గోస్ ఇంటర్నేషనల్ ఎన్జీవో నుంచి 6 గురు సభ్యుల బృందం బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు, ప్రధాన కాలువను సందర్శించారు.

నిజాంసాగ‌ర్ ప్రాజెక్ట్, ప్ర‌ధాన కాలువ‌ను సంద‌ర్శించిన ఇథియో ఫియో సిన‌ర్గోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎన్జీవో  బృందం
X

దిశ‌, నిజాంసాగ‌ర్ : ఇథియోఫియో నీటి పారుదల మంత్రిత్వశాఖ, సినర్గోస్ ఇంటర్నేషనల్ ఎన్జీవో నుంచి 6 గురు సభ్యుల బృందం బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు, ప్రధాన కాలువను సందర్శించారు. ఇందులో భాగంగా వారు ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, విపత్తు నిర్వహణ, ఆయకట్టు వివరాలు, ప్రధానకాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలువలు వాటి పనితీరు గురించి నీటి పారుదల శాఖ ఎస్ఈ దక్షిణమూర్తి, ఈఈ సోలోమాన్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం మహా అద్భుతంగా ఉందని ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందించే విధానం చాలా చక్కగా ఉందని కొనియాడారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో బృందం సభ్యులు స్కైడైవ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ మెనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎస్ఎల్ నారాయణ, డైరక్టర్ రఘుకిరణ్, ప్రొగ్రామ్ మేనేజర్ వరప్రసాద్ ఉన్నారు. వారి వెంట నిజాంసాగర్ ప్రాజెక్టు ఏఈఈలు అక్షయ్, సాకేత్ లు ఉన్నారు. వర్కింగ్ అఫ్ ఇరిగేషన్ సక్టార్, వాటర్ మెనేజ్ మెంట్ అనే ఇంటర్నేషనల్ స్టడీ అండ్ ఎక్స్ పోజ‌ర్ విజిట్ ప్రోగ్రామ్ లో భాగంగా వారు సందర్శించారు.

Next Story