ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి దొంగగా మారిన విద్యార్థి

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి టౌన్ : ఆన్ లైన్ గేమ్ కు అల‌వాటు ప‌డి విద్యార్థి దొంగ‌గా మారిన సంఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా అడిష‌న‌ల్ ఎస్పీ విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను

ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి దొంగగా మారిన విద్యార్థి
X

దిశ, కామారెడ్డి టౌన్ : ఆన్ లైన్ గేమ్ కు అల‌వాటు ప‌డి విద్యార్థి దొంగ‌గా మారిన సంఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా అడిష‌న‌ల్ ఎస్పీ విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 11న ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి మంచి నీళ్లు కావాలని మహిళ వ‌ద్ద నుంచి బంగారు చైను లాక్కొని వెళ్ళాడు. నిందితుడు వచ్చినా మార్గాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక వ్యక్తి కొద్ది దూరంలో అనుమనస్ఫనంగా కనిపించగా.. అతని పట్టుకున్న పట్టుకొని విచారించగా మహిళ మెడల నుండి బంగారు చైను తీసుకు వెళుతున్నాను అని తెలిపాడు. విచార‌ణ‌లో అత‌ని పేరు రోహిత్ దయవార్ అని తేలింది. అతను మహారాష్ట్రకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. అతన్ని న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అతని వ‌ద్ద నుండి 13 గ్రాముల బంగారు చైను, సామ్సంగ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ నరహరి, ఎస్సై పాల్గొన్నారు.

Next Story