- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎనిమిది కాళ్లతో వింత గొర్రెపిల్ల జననం
by Batti.Sumithra |
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లు ఇప్పటి వరకు అక్కడక్కడ కొన్ని వింత సంఘటనల గురించి వినే ఉంటాం.

X
దిశ, బిచ్కుంద : పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లు ఇప్పటి వరకు అక్కడక్కడ కొన్ని వింత సంఘటనల గురించి వినే ఉంటాం. ఏనుగు ఆకారంలో పంది పుట్టడం, రెండు తలల దూడ జన్మించడం, కోతి రూపంలో మనిషి జన్మించడం ఇలాంటివి వినే ఉంటాం. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా అలాంటి ఒక వింత సంఘటనే ఒకటి వెలుగు చూసింది.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నెమ్లి గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది. గ్రామంలోని నవీన్ పటేల్ అనే రైతుకు ఓ గొర్రెల మంద ఉంది. అయితే వాటిలో ఓ గొర్రె ప్రసవించి ఎనిమిది కాళ్ల గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా అందరికీ తెలిసి గ్రామ ప్రజలందరూ ఆ వింత గొర్రెపిల్లను చూడడానికి తరలివెళ్లారని సమాచారం. కాగా ఎనిమిదికాళ్ల వింత గొర్రెపిల్ల పుట్టిన కొద్దిసేపటికే మృతిచెందింది.
Next Story






