- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రపహాడ్‌లో వింత సంఘటన..!
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలోని ఐదవ వార్డ్ లో ఒక వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దిశ,తాడ్వాయి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలోని ఐదవ వార్డ్ లో ఒక వింత ఘటన స్థానికులను ఆచార్యానికి గురిచేస్తోంది. గత నెల రోజులుగా ఒకే కాలనీలోని సుమారు 10 ఇళ్లకు పైగా ఆకాశం నుంచి పసుపు రంగుతో కూడిన చుక్కల వలె ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య రాలుతున్నట్లు ఆ కాలనీవాసులు తెలుపుతుండడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. ఎర్రపహాడ్ గ్రామంలోని ఐదవ వీధిలో ఉన్న పది ఇళ్లకు పైగా ఇంటి ముందు గుడి పరిసలాలలో ఖాళీ ప్రదేశాల్లో, పెంకుటిల్ల పై పసుపు రంగుతో కూడిన బిందువుల రూపంలో పడుతోంది.మొదట్లో దీనిని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు.అయితే,రోజురోజుకూ ఇది క్రమం తప్పకుండా పడుతుండటంతో కాలనీవాసులు ఆశ్చర్యానికి,అయోమయానికి లోనవుతున్నారు.అసలు ఈ పసుపు రంగు తో కూడిన బిందువులు ఎక్కడి నుండి వస్తోంది? ఎందుకు పడుతోంది? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
అధికారుల తనిఖీ .. వీడని మిస్టరీ
విషయం తెలుసుకున్న స్థానిక మెడికల్ ఆఫీసర్ ఖాసీం ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఘటన స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.బాత్రూమ్ పైపుల ద్వారా ఏవైనా వ్యర్థాలు బయటకు వెదజల్లబడుతున్నాయా అన్న అనుమానంతో,ముందు జాగ్రత్తగా ఆ పైపులకు ప్లాస్టిక్ కవర్లను కట్టి మూసివేశారు.అయినప్పటికీ,ఆ పసుపు బిందువులు పడటం ఆగకపోవడంతో అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.
హాట్ టాపిక్‌గా మారిన వింత ఘటన
పైపులు మూసివేసినా,చుట్టుపక్కల ఎలాంటి చెట్లు లేకపోయినా ఈ పసుపుతో కూడిన తుంపార్లు ఎక్కడి నుండి పడుతున్నాయో అంతుచిక్కడం లేదు.దీంతో ఈ వింత ఘటన ఇప్పుడు ఊరంతా పాకి హాట్ టాపిక్ గా మారింది. అధికారులు ఈ పసుపుతో కూడిన బిందువులవలే పడిన వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపి,అసలు ఇది రసాయన చర్యనా లేక ప్రకృతి వింతనా అని అధికారులు తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఒంటిపై పడితే ఏమవుతుందే అని భయం
పసుపు బిందువులు ఒంటిపై పడితే ఏమన్నా అవుతుందేమోనని ఆందోళనగా ఉందని ఎర్రపహడ్ గ్రామ ఆలయఅర్చకుడు సంతోష్ తెలిపారు. అలాగే గత నెల రోజులుగా ఈ సమస్య పీడిస్తోంది. బయట బట్టలు ఆరేయాలన్నా,పిల్లలు ఆడుకోవాలన్నా భయమేస్తోంది. పసుపు బిందువులు ఒంటిపై పడితే ఏమన్నా అవుతుందేమోనని ఆందోళనగా ఉంది. పైపులు మూసినా, చుట్టుపక్కల చెట్లు లేకపోయినా ఇవి ఎలా వస్తున్నాయో అధికారులకే తెలియడం లేదు.దయచేసి ఉన్నతాధికారులు స్పందించి దీనిని ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు.






