- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాలతో దెబ్బతిన్న రహదారి పునరుద్ధరణకు ముందడుగు
దిశ, నిజాంసాగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ మండల కేంద్రంలో బొగ్గు గుడిసె నుంచి నిజాంసాగర్ వచ్చే ఎల్లారెడ్డి - పిట్లం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది.

దిశ, నిజాంసాగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ మండల కేంద్రంలో బొగ్గు గుడిసె నుంచి నిజాంసాగర్ వచ్చే ఎల్లారెడ్డి - పిట్లం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. దీంతో స్థానిక ప్రజలు ప్రయాణికులు రోడ్డును మరమ్మత్తు చేయాలని కోరడంతో, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలేటి మల్లికార్జున్ వెంటనే స్పందించి ప్రధాన రహదారి గుంతలతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శనివారం రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. భారీ వర్షాల ప్రభావంతో రహదారి మొత్తం గుంతలతో నిండిపోయి, రెండు చక్రాల వాహనాలే కాకుండా ఆటోలు, కార్లు కూడా ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. రాకపోకలు దాదాపు నిలిచిపోయే స్థితికి చేరడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిగణనలోకి తీసుకున్న నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా రహదారి పరిస్థితిని పరిశీలించారు. తాత్కాలికంగా రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభించి, ట్రాక్టర్లతో మొరము, కంకర తీసుకువచ్చి రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల్లో పోసి మరమ్మతులు చేపట్టారు. త్వరలోనే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి, చెడిపోయిన రోడ్డుకు శాశ్వత మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. స్థానిక ప్రజలు ఏలే మల్లికార్జున్ చొరవకు అభినందనలు తెలుపుతూ ప్రజల సమస్యను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు.






