నాగిరెడ్డిపేటలో "మళ్లీ కలిసిన క్షణం" షార్ట్ ఫిలిం విడుదల

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ : షార్ట్ ఫిలింస్ రంగంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రానికి చెందిన యువకులు అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారు. నాగిరెడ్డిపేట మండల

నాగిరెడ్డిపేటలో మళ్లీ కలిసిన క్షణం షార్ట్ ఫిలిం విడుదల
X

దిశ, నాగిరెడ్డిపేట్ : షార్ట్ ఫిలింస్ రంగంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రానికి చెందిన యువకులు అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కొంతమంది యువకులు తాము పుట్టిన ఊరు పై మమకారంతో ఊరు పేరునే "కేరాఫ్ గోపాల్ పేట్" అనే ఛానల్ గా మార్చి షార్ట్ ఫిలింస్ నిర్మిస్తున్నారు. కాగా వారు ఇటీవల వినూత్నంగా "మళ్లీ కలిసిన క్షణం" అనే షార్ట్ ఫిలిం ను దర్శకుడు వరుణ్ దండు దర్శకత్వంలో, నిర్మాత కంచనపల్లి ప్రవీణ్ గౌడ్ స్థానిక నటీనటులతో నిర్మించారు. ఈ మళ్లీ కలిసిన క్షణం షార్ట్ ఫిలిం ను దీపావళి పండుగ సందర్భంగా శనివారం రాత్రి నిర్మాత ప్రవీణ్ గౌడ్ కేక్ కట్ చేసి హట్టహాసంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మళ్లీ కలిసిన క్షణం షార్ట్ ఫిలిం నిర్మాత ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ కేరాఫ్ గోపాల్ పేట్ ఛానల్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, ప్రస్తుత సమాజంలో యువతకు ఆదర్శంగా నిలిచి సమాజానికి ఉపయోగపడే కథాంశాలతో షార్ట్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ కలిసిన క్షణం షార్ట్ ఫిలిం లో హీరోగా గోపాల్ పేట్ యువకుడు ఎండి. గపూర్, హీరోయిన్ గా నిజామాబాద్ కు చెందిన మౌనిక లు నటించారన్నారు. ప్రేక్షకులు తాము నిర్మించిన 'మళ్లీ కలిసిన క్షణం' షార్ట్ ఫిలిం ను యూట్యూబ్ లోకి వెళ్లి కేరాఫ్ గోపాల్ పేట్ అని టైప్ చేసి షార్ట్ ఫిలిం ను వీక్షించి ఆదరించాలని కోరారు.

Next Story