ఆటోను ఢీ కొట్టిన ఇసుక ట్రాక్ట‌ర్.. మ‌హిళా మృతి

by Ratna Kumari |

ఇసుక ట్రాక్ట‌ర్ ఆటోను ఢీ కొట్ట‌డంతో ఓ మ‌హిళా అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న బాన్సువాడ మండ‌లం కొల్లూరు శివారు వ‌ద్ద చోటు చేసుకుంది.

ఆటోను ఢీ కొట్టిన ఇసుక ట్రాక్ట‌ర్.. మ‌హిళా మృతి
X

దిశ, బాన్సువాడ : ఇసుక ట్రాక్ట‌ర్ ఆటోను ఢీ కొట్ట‌డంతో ఓ మ‌హిళా అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న బాన్సువాడ మండ‌లం కొల్లూరు శివారు వ‌ద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాన్సువాడ మండ‌లం కొల్లూరు శివారు వ‌ద్ద ఆటోను ఇసుక ట్రాక్ట‌ర్ ఢీ కొట్టింది. దీంతో నీర‌డి రుకుంబాయి అనే మ‌హిళా ఘ‌ట‌న స్థ‌లంలోనే మృతి చెందింది. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. వీరిని బాన్సువాడ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇసుక ట్రాక్ట‌ర్ డైవ‌ర్ అతివేగంగా రావ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఒకే ప‌ర్మిట్ పై రెండు, మూడు ట్రిప్పులు తీసుకెల్లుందుకే అతివేగంగా రావ‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు పోలీసుల ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తి ట్రాక్ట‌ర్ కు స‌రైన నెంబ‌ర్ ప్లేట్ ఉండేలా ప‌రిమిత వేగంతో న‌డిపేట‌ట్టు అధికారులు చూడాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Next Story