- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మున్సిపల్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.

దిశ, ఆర్మూర్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మున్సిపల్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొటార్మూరు ఏరియాలో మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు పరిధిలో 44వ జాతీయ నెంబర్ వెంట గల షిప్ మార్కెట్ వద్ద ఈనెల 02న ఆర్మూర్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఇప్సపల్లికి చెందిన ఓ వ్యక్తి తన కారుతో కోటార్ మురుకు చెందిన గాజర్ల లింగంగౌడ్ కి యాక్సిడెంట్ చేశాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయపడిన లింగం గౌడ్ ను అతని బంధువులు హైదరాబాద్ లోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. అతని స్వగ్రామం కోటార్ మూరులో సోమవారం లింగంగౌడ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.






