కాలువలో పడి వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : ప్రమాదవశాత్తు వరద కాలువలో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న క‌మ్మ‌ర్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో చోటు చేసుకుంది.

కాలువలో పడి వ్యక్తి మృతి
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : ప్రమాదవశాత్తు వరద కాలువలో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘ‌ట‌న క‌మ్మ‌ర్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో చోటు చేసుకుంది. మంగళవారం ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమిరే రాజేందర్(47) బట్టలకు బురద అంటుకోవడంతో కడుక్కోవడానికి కమ్మర్ పల్లి మండల కేంద్రం నుండి నాగపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న‌ వరద కాలువ వ‌ద్ద‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువ లో జారి పడి మునిగి మ‌ర‌ణించిన‌ట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Next Story