గ్రామ బహిష్కరణ చేయాలంటూ వాట్సప్‌లో హల్ చల్

by velandi.Saikiran |   (  Updated:2025-09-08 11:57:38  IST  )

కుక్క తోక వంకర అన్నట్టు.. నిత్యం దొంగతనం చేస్తూ పట్టుబడ్డ గాని అతని నైజం మార‌డం లేదు. రోజు రోజుకు రెచ్చిపోతూనే ఉన్నాడు.

గ్రామ బహిష్కరణ చేయాలంటూ వాట్సప్‌లో హల్ చల్
X

దిశ, రాజంపేట : కుక్క తోక వంకర అన్నట్టు.. నిత్యం దొంగతనం చేస్తూ పట్టుబడ్డ గాని అతని నైజం మార‌డం లేదు. రోజు రోజుకు రెచ్చిపోతూనే ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే తలమడ్ల గ్రామానికి చెందిన నరేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక దొంగతనం చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. దొంగ‌త‌నం చేసి జైలుకెళ్ళి తిరిగి వచ్చినా కూడా ఇత‌గాడి బుద్ది మార‌డం లేదు.

ఈ త‌రుణంలోనే గత రాత్రి తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని మహేందర్ రెడ్డి వాటర్ మోటర్ దొంగతనానికి గురైంది. దీంతో నరేష్ ను మ‌హేంద‌ర్ రెడ్డి, గ్రామాస్తులు నిల‌దీశారు. కానీ నేరం ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలోనే నరేష్ ఇంటి ముందర ఓ బైక్ కనిపించింది.

ఇది ఎవరిదని నిల‌దీయ‌గా...నా ఫ్రెండ్ ది అంటూ నాట‌కాలు ఆడాడు నరేష్. బైక్ నంబ‌ర్ చెక్ చేయ‌గా... వేములవాడ గ్రామస్తుందని తెలిసింది. ఇప్ప‌టికే త‌న వెహికల్ పోయిందని ఈ మధ్యలో పోలీస్ స్టేషన్ లో ఆ బైక్ వ్య‌క్తి కంప్లైంట్ ఇచ్చాడట‌. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు....గ్రామపంచాయతీ ఆవరణంలో న‌రేష్ ను కట్టేసి చితక బాదారు. అనంత‌రం పోలీసులకు అప్పజెప్పారు. దీంతో అతన్ని గ్రామం నుంచి బహిష్కరించాలని వాట్సాప్ లో హల్ చల్ చేస్తున్నారు.

Next Story