మానవత్వం చాటుకున్న కలెక్టర్

by Ratna Kumari |

దిశ‌, నిజాంసాగ‌ర్ : ప్రమాదంలో గాయపడి రోడ్డు పై పడి ఉన్న వ్యక్తిని చూసి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మా

మానవత్వం చాటుకున్న కలెక్టర్
X

దిశ‌, నిజాంసాగ‌ర్ : ప్రమాదంలో గాయపడి రోడ్డు పై పడి ఉన్న వ్యక్తిని చూసి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మానవత్వంతో స్పందించారు. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, క్షతగాత్రుడిని తన సొంత వాహనంలోనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణదాతగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు. నిజాంసాగర్ - మాగి మధ్య గోర్గల్ శివారులో ఒక బైక్, ఆటోను వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెద్ద కొడప్గల్ మండలం పోచారం తాండకు చెందిన సుందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెంటనే వాహనాన్ని ఆపి, గాయపడిన సుందర్ సింగ్‌ను తన వాహనంలోనే ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ చూపిన సమయస్ఫూర్తిని మానవత్వాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Next Story