- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య కు గురయ్యాడు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపైనే ఉన్న బ్రిడ్జి వద్ద ఆరిఫ్ డాన్ అనే రౌడీషీటర్ ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. గురువారం బోధన్ కోర్టులో వాయిదాకు హాజరై నిజామాబాద్ కు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అతని అనుసరించి వస్తున్న నిజామాబాద్ నగరానికి చెందిన ప్రత్యర్థులు ఈ హత్య చేసినట్టు సమాచారం. నిజామాబాద్ నగరానికి చెందిన ఆరిఫ్ డాన్ పై రెండు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయి. జనవరి 1న నిజామాబాద్ నగర శివారులోని నెహ్రు నగర్ లో జంగల్ ఇబ్బు అలియాస్ ఇబ్రహీం అనే రౌడీషీటర్ ను హత్య చేసి మూడు నెలల క్రితమే జైలు నుంచి ఆరిఫ్ విడుదలయ్యాడు. ఆరిఫ్ జైలు నుంచి విడుదల తర్వాత పీడి యాక్ట్ నమోదు చేస్తామని అనుకున్న రెగ్యులర్ సిపి ఇక పోవడంతో వాయిదా పడింది. ఈ సమయంలోనే ప్రత్యర్థుల చేతిలో ఆరిఫ్ డాన్ హతమయ్యాడు. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆరిఫ్ డెడ్ బాడీని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆరిఫ్ ను హత్య చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.