- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న బీజేపీ నాయకుడు
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గడ్డం మోహన్ రెడ్డి శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

X
దిశ, ఏర్గట్ల : ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గడ్డం మోహన్ రెడ్డి శనివారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి మంత్రి వేముల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ రైతుల సంక్షేమ పథకాలతో పాటు, తెలంగాణ ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, భువనగిరి రమేష్, ఏనుగు నవీన్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






