- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్ అదాలత్ లో 5,662 కేసులు రాజీతో పరిష్కారం
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదై, రాజీపడేందుకు అవకాశం ఉన్న 5,662 లాంగ్ పెండింగ్ కేసులు రాజీతో పరిష్కారమయ్యాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదై, రాజీపడేందుకు అవకాశం ఉన్న 5,662 లాంగ్ పెండింగ్ కేసులు రాజీతో పరిష్కారమయ్యాయి. గత నెల నుండి ఈనెల 28 వరకు కొనసాగిన జాతీయ లోక్ అదాలత్ లో ఈ కేసులన్నీ పరిష్కారమైనట్లు నిజామాబాద్ సీపీ పి.సాయిచైతన్య వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి 134 కేసుల్లో డబ్బులు కోల్పోయిన రూ. 31,82,649 లు సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు అందజేసినట్లు సీపీ తెలిపారు. ఐసీసీ అండ్ బీఎన్ఎస్ అండ్ ఎస్ఎల్ఎల్ కేసులు 621, సైబర్ క్రైం కేసులు 134, ఇ పెట్టి కేసులు 2190 వీటితో పాటు 2717 డీడీ అండ్ ఎంవీ యాక్ట్ కేసులలో రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు సీపీ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జిల్లా కు సైబర్ క్రైం, వివిధ కేసులలో రాజీ మార్గం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంతో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైం సిబ్బంది, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమిషనర్ అభినందించారు.
రాజీ మార్గమే రాజమార్గం..
క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాల్ అనేది ఒక మంచి అవకాశమన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని సీపీ పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ) డైరెక్టర్ శిఖాగోయల్ ఆధ్వర్యంలో ఏడు కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ప్రతి జిల్లాలో D4C ని ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందని సీపీ అన్నారు.జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930 కి కాల్ చేయాలని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు కూడా చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వై. వెంకటేశ్వర్ రావ్, సీఐ ముఖీద్ పాషా , సీసీఆర్బీ సీఐ అంజయ్య, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి. సాయిచైతన్య అభినందించారు.






