- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2.53 కోట్ల విలువైన 1579 ఫోన్లు రికవరీ : ఎస్పీ రాజేష్ చంద్ర
దిశ, కామారెడ్డి : జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను నెలకు 150 కి పైగా రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.2.53 కోట్ల

దిశ, కామారెడ్డి : జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను నెలకు 150 కి పైగా రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.2.53 కోట్ల విలువైన 1579 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వివరించారు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైనదని, అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత ఫోటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు కేవలం పరికరాన్ని మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కూడా కోల్పోతున్నారని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని, అలాగే సిమ్ కార్డ్ ను బ్లాక్ చేసి అదే నంబరుతో కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ బాలరాజుతో పాటు 6 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడిందన్నారు. ఈ సంవత్సరం ఎనిమిదో దఫాగా గత 15 రోజుల్లో ఈ బృందం 164 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిందన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 1,579 మొబైల్ ఫోన్లు, సుమారు ₹2.53 కోట్ల విలువగలవి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,026 మొబైల్ ఫోన్లు (₹6.45 కోట్ల విలువగలవి) రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.






