మద్యం షాపుల కోసం 149 దరఖాస్తులు

by Ratna Kumari |

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాపులకు 2025 - 2027 సంవత్సరానికి షాపుల లీజు కోసం శనివారం 34 దరఖాస్తులు నమోదయ్యాయి. దరఖాస్తుల ప్రక్రియ

మద్యం షాపుల కోసం 149 దరఖాస్తులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాపులకు 2025 - 2027 సంవత్సరానికి షాపుల లీజు కోసం శనివారం 34 దరఖాస్తులు నమోదయ్యాయి. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు 149 దరఖాస్తులు నమోదైనట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ పరిధిలోని 36 షాపులకు 53 దరఖాస్తులు, బోధన్ స్టేషన్ పరిధిలో 18 షాపులకు 23 దరఖాస్తులు, ఆర్మూర్ స్టేషన్ పరిధిలో 25 వైన్ షాపులకు 36 దరఖాస్తులు, భీమ్ గల్ స్టేషన్ పరిధిలో 12 షాపులకు 22 దరఖాస్తులు, మోర్తాడ్ స్టేషన్ పరిధిలోని 11 వైన్ షాపులకు 15 దరఖాస్తులు నమోదైనట్లు ఈఎస్ మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 149 దరఖాస్తులు నమోదయ్యాయని, ఈనెల 18 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందన్నారు.

Next Story