- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి వద్దనే మహిళకు సాధారణ ప్రసవం చేసిన 108 సిబ్బంది..
by Nalla Sampath Reddy |
కొత్తబాది తండాకు చెందిన తేజావత్ అశ్వినికి 108 సిబ్బంది ఇంటివద్దనే సాధారణ ప్రసవం చేశారు.

X
దిశ, గాంధారి: మండలంలోని కొత్తబాది తండాకు చెందిన తేజావత్ అశ్వినికి 108 సిబ్బంది ఇంటివద్దనే సాధారణ ప్రసవం చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తబాది తండాకు చెందిన తేజావత్ అశ్వినికి పురిటినొప్పులు ఎక్కువవడంతో భర్త రవి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా సిబ్బంది సురేష్, ప్రకాష్ గౌడ్ వెంటనే తండాకు చేరుకొని సదరు మహిళను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే నొప్పులు ఎక్కువవడంతో ఇంటి వద్దనే సాధారణ ప్రసవం చేశామని, అశ్విని ఆడబిడ్డకు జన్మించినట్టు వారు తెలిపారు. వైద్యుడు మనీష్ సలహాతో మెరుగైన వైద్యం కొరకు గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సిబ్బంది తెలిపారు. కాగా అశ్వినికి సాధారణ ప్రసవం చేసి, తల్లి, బిడ్డను క్షేమంగా ఉండేలా వైద్యం అందించిన సిబ్బందికి మహిళ భర్త రవి ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story






