KFCలో చికెన్ తింటున్నారా... జాగ్రత్త

by Ajay Maddhiboyina |

బ‌య‌ట ఫుడ్ అంటే లొట్ట‌లేసుకుని తింటుంటారు. అయితే ఆ ఫుడ్ వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని గుర్తించరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప‌లు రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో త‌నిఖీలు చేసి పాడైన ఆహారం అందించ‌డంతో చ‌ర్య‌లు

KFCలో చికెన్ తింటున్నారా... జాగ్రత్త
X

దిశ, వెబ్ డెస్క్: బ‌య‌ట ఫుడ్ అంటే లొట్ట‌లేసుకుని తింటుంటారు. అయితే ఆ ఫుడ్ వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని గుర్తించరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప‌లు రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో త‌నిఖీలు చేసి పాడైన ఆహారం అందించ‌డంతో చ‌ర్య‌లు తీసుకున్నా వారి తీరులో మాత్రం మార్పు రావ‌డంలేదు. తాజాగా చాలా మంది లొట్ట‌లేసుకుని తినే కేఎఫ్‌సీలో కుల్లిపోయిన చికెన్ సప్లై చేయడంతో కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ ఘటన నిజామాబాద్ లోని వేణుమాల్‌లో చోటు చేసుకుంది. కస్టమర్లు కేఎఫ్‌సీకి వెళ్లి లెగ్ పీస్ ఆర్డర్ ఇవ్వగా సిబ్బంది కుళ్లిపోయిన చికెన్ తీసుకువచ్చి ముందు పెట్టారు. తింటుండగా వాసన రావడంతో వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. అయినప్పటికీ సిబ్బంది క్షమాపణలు చెప్పకుండా వాళ్లపైనే దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడ ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘటనపై బాధితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఘటనపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story