నితిన్ నబీన్ తెలంగాణ టూర్ అట్టర్ ఫ్లాప్.. టీపీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని, ఆయన మూడు రోజుల పర్యటనలో ఏం చేశారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

నితిన్ నబీన్ తెలంగాణ టూర్ అట్టర్ ఫ్లాప్.. టీపీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని, ఆయన మూడు రోజుల పర్యటనలో ఏం చేశారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వస్తే పట్టుమని 2 వేల మందిని కూడా పోగు చేసుకోలేని పార్టీ బీజేపీ అని, బీజేపీకి తెలంగాణలో అవకాశం లేదు, అవసరం లేదన్నారు. బుధవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ పరిస్థితుల మీద, కుల సమీకరణల మీద ఉద్యమం మీద నితిన్ నబీన్ కి అవగాహన ఉందా? వికసిత్ భారత్ లో తెలంగాణ లేదా? అని నిలదీశారు. బీజేపీ ముక్త్ భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల గురించి నితిన్ నబీన్ ఎందుకు మాట్లాడలేదు? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో ఇంకా ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ను ఢీ కొట్టలేరని, పేద ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదన్నారు.

90 శాతం ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ దాడులు చేయించారని, సీబీఐ, ఈడీలను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సంపన్న వర్గం కోసం కేంద్రంలోని బీజేపీ పని చేస్తోందని, అయోధ్య దోపిడీ గురించి నబీన్ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. వేల మంది ప్రాణ త్యాగం, సోనియా గాంధీ వల్ల తెలంగాణ సాకారమైందని, కాంగ్రెస్ పార్టీకి మినహాయించి తెలంగాణలో ఏ పార్టీకి చోటు లేదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలా గుండెల్లో కాంగ్రెస్ పార్టీ శాశ్వతమన్నారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఫాంహౌస్ కు పరిమితం అయ్యారని, బావ, బామ్మర్ది తమపై విష ప్రచారం చేస్తున్నా, తెలంగాణ ప్రజలు తమ పార్టీ వైపు ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story