- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లొకేషన్ బాగుందని రీల్ చేశా తప్పేంటి? శ్రీశైలం ఆలయం వద్ద రీల్స్ చేసిన యువతి
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ప్రధాన రహదారిపై ఓ యువతి రీల్స్ చేయడంతో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ప్రధాన రహదారిపై ఓ యువతి రీల్స్ చేయడంతో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. నిత్య క్యూట్ బేబీ పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో యువతి వీడియోలను పోస్ట్ చేసింది. వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే తన రీల్స్ పై విమర్శలు రావడంతో నిత్య క్యూట్ బీబీ స్పందించింది.
శ్రీశైలంలో లొకేషన్ బాగుందని వీడియో తీసుకున్నానని చెప్పారు. ఫోక్ సాంగ్ ట్రెండింగ్ లో ఉందని దానిపై చేశానని తెలిపింది. తాను పద్దతిగా చీరకట్టుకునే రీల్స్ చేశానని తెలిపింది. పొట్టిపొట్టి బట్టలు వేసుకోలేదని చెప్పింది. ఆలయంలోకి తాను ఫోన్ తీసుకుని వెళ్లలేదని, బయటకు వచ్చిన తరవాత రోడ్డు పక్కన వీడియోలు తీసుకున్నానని తెలిపింది. కేసులు పెడతామని, అది ఇది అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను తప్పుగా ప్రవర్తించలేదని, తప్పు చేశానని అనుకుంటే క్షమించాలని కోరింది.






