Nirmala Sitharaman: ఉచిత పథకాల కోసం రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక

by Prasad Jukanti |

ఉచిత పథకాలు సమస్య కాదని వాటిని ఆయా రాష్ట్రాల బడ్జెట్ లు భరించలేకపోవడమే అసలు సమస్య అని కేంద్ర ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nirmala Sitharaman: ఉచిత పథకాల కోసం రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల సంస్కృతి (Freebie Culture) వేగంగా పెరుగుతుండటం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్య ఉచిత పథకాల గురించి కాదని వాటిని భరించే సామర్థ్యం రాష్ట్రాల బడ్జెట్‍కు లేకపోడవమే అసలు సమస్య అన్నారు. ఇవాళ హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‍లో (Hindustan Times Leadership Summit) మాట్లాడిన ఆమె.. ఉచిత పథకాల కోసం రాష్ట్రాలు అప్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. అప్పు తీర్చేందుకు రాష్ట్రాలు మళ్లీ అప్పులు చేయడం సరైన చర్య కాదన్నారు.

ఆ రుణాలను భర్తీ చేయాల్సి రావొచ్చు:పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అప్పుల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే రాష్ట్రాలకు నేరుగా నిధులు ఇవ్వకుండా నిపుణుల పరిజ్ఞానం ద్వారా సహకారం అందిస్తున్నామని ఆమె చెప్పారు. ఖర్చులు, ఆర్థిక వ్యవహారాల శాఖలకు చెందిన అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖలతో కలిసి అప్పుల నిర్మాణాన్ని పునః సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇకపై తమ రుణాలను తీర్చే పరిస్థితి లేదని దీంతో రాష్ట్రాల పాత, ఖరీదైన రుణాలను వాటి జరిమానాలతో సహా భర్తీ చేయాల్సి రావచ్చని ఆమె పేర్కొన్నారు.

జీఎస్టీ తర్వాత నెక్స్ట్ సంస్కరణ అదే:

ఇటీవల జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు చేసిన నేపథ్యంలో కేంద్రం తదుపరి చేపట్టబోయే ఆర్థిక సంస్కరణలపై నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా హింట్ ఇచ్చారు. కస్టమ్స్‌ సుంకాల సరళీకరణ చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా రూపొందించనున్నట్లు చెప్పారు. భారతదేశ కస్టమ్స్ ఫ్రేమ్‌వర్క్ యొక్క సమగ్ర మార్పు జరుగుతోందని, దీనిని ఆమె next big clean-up job గా పేర్కొన్నారు. రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వ్యాఖ్యానించారు.

Next Story