Karur: కరూర్‌కు కేంద్ర మంత్రులు.. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన నిర్మలాసీతారామన్

by Prasad Jukanti |   (  Updated:2025-09-29 09:46:20  IST  )

కరూర్ తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని కేంద్రం మంత్రులు పరిశీలించారు.

Karur: కరూర్‌కు కేంద్ర మంత్రులు.. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన నిర్మలాసీతారామన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర విషాదం నింపిన టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ పార్టీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు ఇవాళ పరిశీలించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ (L.Murugan) కోయంబత్తూరు కరూర్ లో తొక్కిసలాట (Karur stampede) జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈరోజు ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రులు తొక్కిసలాటకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్య పరిస్థుతులపై ఆరా తీశారు. కాగా కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 40 మంది మృతి చెందగా తాజాగా సోమవారం మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రం.. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Next Story